: తెలంగాణలో ప్రతి సమస్యకు నేనే కారణం అంటే ఎలా?: ఏపీ సీఎం
తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలకు, రైతుల సమస్యలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమంటున్న టీఆర్ఎస్ వ్యాఖ్యలపై చంద్రబాబు దీటుగా సమాధానమిచ్చారు. విద్యుత్ రాకపోయినా, నీళ్లు రాకపోయినా నేనే కారణమంటే ఎలా? అని మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. 'రేపు టీఆర్ఎస్ వారు ఇంట్లో కాపురం చేయకపోయినా నేనే కారణం అంటారేమో'నని ఎద్దేవా చేశారు. ఇక కరవుకు కూడా నేనే కారణం అవుతానా? అని బాబు ప్రశ్నించారు. అభివృద్ధిలో పోటీపడాలి కానీ ఇలా గిల్లికజ్జాలు పెట్టుకోవద్దని సూచించారు. విద్యుత్ విషయంపై సరిగా మేనేజ్ చేయలేక తమపై తప్పులు నెడతారా? అని అడిగారు. నల్గొండలో తమ పార్టీ కార్యాలయాన్ని ఎలా తగులబెడతారని సూటిగా నిలదీశారు. టీడీపీ కృషి వల్లే తెలంగాణ, హైదరాబాదులో ఆదాయం పెరిగిందని, ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసునని సీఎం పేర్కొన్నారు.