: ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు


సోషల్ మీడియాను మెరుగైన రీతిలో వాడుకునే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాతే ఎవరైనా. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియా సాయంతో ప్రచారం హోరెత్తించిన మోదీ, తాజాగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపేందుకూ దానినే ఆశ్రయించారు. మునుపటి ప్రధానుల మూస పద్దతికి స్వస్తి పలికి సరికొత్త తరహాలో ఆయన తన సందేశాన్ని ట్విట్టర్ లో విడుదల చేశారు. అంతేకాదు, దీపావళి పర్వదిన శుభాకాంక్షల కోసం ఆయన ఓ ప్రత్యేక పేజీనే తెరిచారు. సదరు పేజీని చూడండంటూ ట్వీట్ చేశారు. ‘ఈ దీపావళి సందర్భంగా ఇ-గ్రీటింగ్స్ ను పంపండి’ అని కూడా ఆయన సదరు సందేశంలో దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News