: భారతీయులకు ఆస్ట్రేలియా ప్రధాని దీపావళి శుభాకాంక్షలు


దీపావళి పండుగను పురస్కరించుకుని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబ్బాట్ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మాట్లాడుతూ, "దీపావళి శుభాకాంక్షలు. మంచి ఆహారం, ఎంటర్ టైన్ మెంట్ తో సంతోషంగా గడపాల్సిన సమయం ఇది. అంతేగాక, కుటుంబసభ్యులు, స్నేహితులతో పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు" అని టోనీ పేర్కొన్నారు. అంతేగాక, మొదటి ప్రపంచయుద్ధంలో భారతీయుల పాత్రను ఆయన ప్రశంసించారు.

  • Loading...

More Telugu News