: ఐరాస మానవ హక్కుల మండలికి తిరిగి భారత్ ఎన్నిక
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలికి భారత్ తిరిగి ఎన్నికయింది. దీంతో, 2015 నుంచి 17 వరకు మానవహక్కుల మండలిలో మన దేశం ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రస్తుతానికి మానవ హక్కుల మండలిలో ఉన్న 47 దేశాలలో భారత్ కు కూడా సభ్యత్వం ఉంది. అయితే, డిసెంబర్ 31న ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తిరిగి ఎన్నిక నిర్వహించాలని ఇండియా కోరింది. ఈ క్రమంలో జరుగుతున్న 69వ యూఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్స్ లో ఎన్నిక జరిపారు.