: దీపావళి రోజున విశాఖ తుపాను బాధితులతో గడుపుతా: వెంకయ్యనాయుడు


ప్రధానమంత్రి నరేంద్రమోడీ బాటనే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అనుసరిస్తున్నారు. ఆయనలాగే తాను కూడా ఈసారి దీపావళి రోజును విశాఖ తుపాను బాధితులతో కలసి గడుపుతానని తెలిపారు. అందుకోసం ఇవాళ, రేపు విశాఖలోనే ఉంటానని చెప్పారు. ప్రధాని మోడీ కాశ్మీర్ వరద బాధితులతో కలసి దీపావళి చేసుకోనున్న సంగతి తెలిసిందే. విశాఖ వాసులకు కేంద్రం అండగా ఉంటుందని, ఇళ్లు కోల్పోయిన వారికి కేంద్రం తరపున పక్కా గృహాలు నిర్మిస్తామని వెంకయ్య తెలిపారు.

  • Loading...

More Telugu News