: దీపావళికి సెలవు ప్రకటించిన పర్యాటక దేశం
హిందువులు నిర్వహించుకునే పండుగల్లో దీపావళిది ప్రముఖ స్థానం. పిల్లల నుంచి పెద్దల వరకూ ఉత్సాహంగా పాల్గొనే పండుగ కావడమే దీనికి విశిష్టతను ఆపాదించి పెట్టింది. ఇక పండుగ అంటే సెలవు తప్పనిసరి. మనదేశంలోనే కాదండోయ్, దీపావళికి ప్రముఖ పర్యాటక దేశం ఇండోనేసియాలోనూ సెలవు ప్రకటించారు. అయితే, బుధవారం ఒక్కరోజేనట. అక్కడ భారత సంతతి వ్యక్తులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అటు, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ కూడా తన నివాసంలో దీపావళి జరుపుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట.