: సీఎం అంశంలో మహారాష్ట్ర బీజేపీలో విభేదాలు


హర్యానాకు సులువుగానే సీఎంను ఎంపిక చేసిన బీజేపీ అధినాయకత్వానికి మహారాష్ట్ర విషయం తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎంగా నితిన్ గడ్కరీని చూడాలని ఉందంటూ కొత్తగా ఎన్నికైన 40 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. గడ్కరీ నివాసానికి చేరుకున్న వీరందరూ, ఈ మేరకు తమ కోరికను గడ్కరీకి తెలిపారు. ఈ ఉదయం మహారాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ సుధీర్ ముగంతివార్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులు గడ్కరీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న రాష్ట్ర బీజేపీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవిస్ కూడా గడ్కరీనే సీఎం అవ్వాలని కోరుకుంటున్నారని ముగంతివార్ పేర్కొన్నారు. ఈ పరిణామాలపై గడ్కరీ స్పందిస్తూ, కేంద్రమంత్రిగా తాను సంతోషంగానే ఉన్నానని, సీఎం విషయం పార్టీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News