: బెంగళూరు పేలుళ్ళకు 'ఏపీ'తో లింకు


దేశంలో ఎక్కడ పేలుళ్ళు జరిగినా ఆంధ్రప్రదేశ్ తో ఏదో రూపేణా సంబంధం ఉండడం పరిపాటిగా మారింది. ఏ నగరంలో విధ్వంసం చోటు చేసుకున్నా ముఖ్యంగా హైదరాబాద్ లో మూలాలు వెలికిచూస్తున్నాయి. నేడు బెంగళూరులో జరిగిన వరుస పేలుళ్ళకు కూడా రాష్ట్రంతో లింకు వెల్లడైంది. ఎన్ఐఏ చేపట్టిన విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ ఆఫీసు ఎదుట సంభవించిన పేలుడులో ఉగ్రవాదులు ఏపీకి చెందిన బైక్ ను వాడినట్టు తెలుస్తోంది. ఈ బైక్ ను రాష్ట్రం నుంచి దొంగిలించి తమిళనాడులో నకిలీ రిజిస్ట్రేషన్ చేయించినట్టు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News