: ఆళ్ళగడ్డ ఉపఎన్నిక నామినేషన్లకు ముగిసిన గడువు
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి జరిగే ఉపఎన్నిక కోసం నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. నిర్ణీత సమయానికి 7 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ, కాంగ్రెస్ నామినేషన్లు దాఖలు చేయలేదు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 చివరితేదీ. ఈ ఉపఎన్నిక నవంబర్ 8న నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఉపఎన్నికలో శోభా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ వైయస్సార్ సీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆమె ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల సందర్భంగా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.