: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బాణాసంచా పేలుడు
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బైపాస్ రోడ్డు వద్ద ఉన్న ఓ ఇంట్లో బాణాసంచా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కిరణ్ అనే యువకుడు మృతి చెందాడు. తులసి, నాగలక్ష్మి అనే ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలవగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనుమతి లేకుండా బాణాసంచా తయారుచేస్తుండగా మందుగుండు పేలి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.