: కరెంట్ కష్టాలపై కేటీఆర్ ను కలసిన పారిశ్రామికవేత్తలు
వారానికి రెండు రోజుల పాటు కరెంట్ కట్ చేయడంపై తెలంగాణ పారిశ్రామికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు ఈ రోజు మంత్రి కేటీఆర్ ను కలిశారు. విద్యుత్ కోతలను వారానికి రెండు రోజులు కాకుండా ఒక రోజుకు కుదించాలని ఈ సందర్భంగా కేటీఆర్ కు వారు విజ్ఞప్తి చేశారు.