: విండీస్ బోర్డు వైఖరిపై ఐసీసీకి లేఖ రాయనున్న బీసీసీఐ


భారత్ లో పర్యటనను రద్దు చేసుకున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై బీసీసీఐ ఆగ్రహం ఇంకా చల్లారలేదు. విండీస్ జట్టుతో భవిష్యత్తులో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడబోమని ప్రకటించిన బీసీసీఐ, తాజాగా, విండీస్ బోర్డు వ్యవహార సరళిపై ఐసీసీకి లేఖ రాయనుంది. ఈ మేరకు బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు బోర్డు సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. హైదరాబాదులో జరిగిన ఈ సమావేశం అనంతరం ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ, "విండీస్ క్రికెట్ బోర్డు ప్రవర్తనను ఐసీసీ దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నాం" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News