: టీడీపీ నేత రేవంత్ రెడ్డిపై కేసు నమోదు
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై రేవంత్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేశారని గోవర్ధన్ రెడ్డి అనే న్యాయవాది నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రేవంత్ కు నోటీసులు జారీ చేశారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ లకు ముడుపులు ముట్టాయని గతంలో రేవంత్ విమర్శలు గుప్పించారు.