: అంగారకుడిపై మొసలి వంటి సరీసృపం?
అంగారకుడిపై పరిశోధనలు చేపడుతున్న క్యూరియాసిటీ రోవర్ ఓ మొసలి వంటి ఆకారాన్ని గుర్తించింది. శిలాజ స్థితిలో ఉన్న ఆ ఆకారం అరుణగ్రహంపై జీవం ఉండేదన్న వాదనలకు బలం చేకూర్చే విధంగానే ఉంది. ఈ ఆకారం క్యూరియాసిటీ రోవర్ రికార్డు చేసిన వీడియోలో కనిపిస్తోంది. దీన్ని పరిశీలించిన జో వైట్ అనే ఖగోళ పరిశోధకుడు స్పందిస్తూ, మొసలి వంటి ఆకారం శిలాజరూపం దాల్చడం గానీ, ఘనీభవించడం గానీ జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా, దీనిపై నాసా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.