: తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు యత్నం: కర్నె
టీడీపీ అధినేత చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు మరింత పదునెక్కుతున్నాయి. శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తిని ఆపివేయాలంటూ చంద్రబాబు ఆదేశించడంపై వారు మండిపడుతున్నారు. అసలే కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతుంటే... కరెంట్ ఉత్పత్తి ఆపేయాలని అడగడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొత్తం తెలంగాణ అస్థిత్వాన్నే దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని టీడీపీ నేతలు చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని ఎద్దేవా చేశారు.