: నర్సుకు లేఖ రాసిన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (61) ఇటీవల అనారోగ్యానికి గురై ఎయిమ్స్ లో చికిత్స పొందడం తెలిసిందే. అక్కడ తనకు సేవలందించిన ఓ నర్సుకు ఆయన తాజాగా లేఖ రాశారు. ఆసుపత్రిలో తనకు ఆమె అందించిన సేవలు అమోఘమని కొనియాడారు. సమర్థవంతంగా, ప్రొఫెషనల్ తరహాలో ఆమె తన పట్ల వ్యవహరించడాన్ని గొప్పగా భావిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. కీలకమైన ఆర్థిక, రక్షణ మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్న జైట్లీ ఇటీవలే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అక్కడ నెలరోజుల పాటు చికిత్స పొందిన అనంతరం, ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన ఎయిమ్స్ లో చేరారు. అనారోగ్యం కారణంగా గత నెలలో ఆస్ట్రేలియాలో జరిగిన జి20 దేశాల ఆర్థిక మంత్రుల సదస్సుకు జైట్లీ గైర్హాజరయ్యారు. కోలుకున్న ఆయన, కొన్ని వారాల కిందటే తిరిగి విధులకు హాజరయ్యారు.