: వెస్టిండీస్ బోర్డుపై దావా వేస్తాం: బీసీసీఐ


భారత పర్యటన నుంచి అర్ధాంతరంగా నిష్ర్కమించిన వెస్టిండీస్ బోర్డుపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాదులో జరిగిన బోర్డు కార్యవర్గ సమావేశంలో వెస్టిండీస్ అంశం, శ్రీలంకతో వన్డే సిరీస్ లపై చర్చించారు. కొద్దిసేపటి కిందటే సమావేశం ముగిసింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై దావా వేస్తామని వెల్లడించింది. అంతేగాక వారితో ఇకపై ద్వైపాక్షిక పర్యటనలు రద్దు చేసుకుంటున్నట్లు బోర్డు తెలిపింది.

  • Loading...

More Telugu News