: అమ్మకానికి జేమ్స్ బాండ్ సబ్ మెరైన్ కారు
1977లో జేమ్స్ బాండ్ మూవీ 'ద స్పై హూ లవ్డ్ మి' చిత్రంలో ఉపయోగించిన లోటస్ ఎస్ప్రిట్ జలాంతర్గామి కారును ప్రముఖ వెబ్ సైట్ ఈ-బే అమ్మకానికి పెట్టింది. ఈ కారును 10,00,000 డాలర్లుకు అమ్మనుందట. మొత్తం మూడు లోటస్ సబ్ మెరైన్ కార్లలో ఇది ఒకటని సదరు యజమాని తెలిపాడు. కారును వినియోగించిన చిత్రంలోని ఒరిజినల్ ఆధారంగా తిరిగి పునరుద్ధరించినట్లు ఈ-బే వివరించింది.