: నేడు రైతు సాధికార సంస్థకు చంద్రబాబు సర్కారు శ్రీకారం!
రైతులకు రుణమాఫీతో పాటు సాగును లాభసాటిగా మార్చేందుకు ఉద్దేశించిన ‘రైతు సాధికార సంస్థ’కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. భవిష్యత్ రాజధానిగా ప్రకటించిన విజయవాడ పరిధిలోని గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఏర్పాటైన ఏపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో రైతు సాధికార సంస్థను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు ప్రారంభించనున్నారు. ఇందుకోసం దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రైతు సాధికార సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఏపీ సర్కారు, ఇకపై అక్కడి నుంచే ఆ సంస్థకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను సాగించనుంది. ఇప్పటికే రైతు సాధికార సంస్థకు రూ. 5 వేల కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.