: తుపాను బాధితుల సహాయార్ధం రాజమౌళి షార్ట్ ఫిల్మ్


హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవాలనే ఆకాంక్షతో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ షార్ట్ ఫిల్మ్ ను నిర్మించారు. దీపావళి పండుగ సందర్భంగా మనం పెట్టే ఖర్చులో సగాన్ని తుపాను బాధితులకు ఇవ్వాలని ఈ ఫిల్మ్ లో రాజమౌళి విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందజేయాలనే మెసేజ్ ఇందులో ఉంది. "సగం దీపాలను మన హృదయాల్లో వెలిగిద్దాం... ఆ వెలుగును విశాఖ కళ్లలో చూస్తాం... పండుగ చేసుకుందాం" అంటూ ఈ షార్ట్ ఫిల్మ్ ముగుస్తుంది. ఈ మెసేజ్ కు హీరో రాణా వాయిస్ వినిపిస్తుంది. అయితే, ఈ షార్ట్ ఫిల్మ్ కు సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించారు.

  • Loading...

More Telugu News