: కరీంనగర్లో కుక్క పిల్లలకు బారసాల... అక్షింతలు వేసిన బంధుమిత్రులు!


కరీంనగర్ జిల్లాలోని వావిలాలపల్లి గ్రామస్తుడు రవికి పిల్లల్లేరు. సంతానం లేని లోటును తమ పెంపుడు కుక్క ద్వారా తీర్చుకుంటున్నారు రవి దంపతులు. వారి ప్రేమకు పాత్రురాలైన ఆ శునకం ఇటీవలే నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో, రవి నివాసానికి కొత్త కళ వచ్చినట్టయింది. ఆ కుక్క పిల్లలకు బారసాల నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన రవి దంపతులకు వచ్చింది. వెంటనే వారు దాన్ని అమల్లో పెట్టారు. ఆ బుజ్జి కుక్క పిల్లలకు, తల్లి కుక్కకు డ్రెస్సులు కుట్టించారు. బంధుమిత్రులందరికీ ఆహ్వానాలు పంపారు. అందరి సమక్షంలో బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాటికి పేర్లు కూడా పెట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బంధుమిత్రులు కుక్క పిల్లలపై అక్షింతలు వేసి, విందు భోజనం కానిచ్చారు. తమ ఇంట జరిగిన శుభకార్యానికి అందరూ రావడంతో రవి దంపతుల్లో ఆనందం వెల్లివిరిసింది.

  • Loading...

More Telugu News