: చదువులో నేనంత యాక్టివ్ కాదు: మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు ఢిల్లీలోని ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైద్య విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. చదువులో తాను ఏమంత యాక్టివ్ కాదని చెప్పుకొచ్చారు. తానెప్పుడూ అవార్డులు అందుకోలేదని తెలిపారు. చదువును నేర్చుకోవాలన్న తపన, ఏకలవ్యుడి లాంటి మేధస్సు కలిగి ఉండాలని సూచించారు. వైద్యరంగంలో పరిశోధనలపై దృష్టిపెట్టాలని సలహా ఇచ్చారు.