: దీపావళి పర్వదినాన హర్యానా పీఠంపై బీజేపీ సీఎం!


హర్యానా ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ అభ్యర్థి అధిరోహించే ముహూర్తం ఖరారైంది. సరిగ్గా దీపావళి పర్వదినాన తమ అభ్యర్థిని హర్యానా సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు బీజేపీ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఇదిలా ఉంటే, హర్యానా సీఎం అభ్యర్థిగా ఎవరిని నియమించాలన్న విషయంలో పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. మంగళవారం జరగనున్న ఆ రాష్ట్ర బీజేపీ శాసన సభాపక్ష భేటీలో సీఎం అభ్యర్థి పేరు ఖరారు కానుంది. ఈ భేటీకి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పరిశీలకుడి హోదాలో హాజరుకానున్నారు. ఆరెస్సెస్ నేపథ్యమున్న మనోహర్ లాల్ ఖత్తార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ విలాస్ శర్మ, పార్టీ అధికార ప్రతినిధి కెప్టెన్ అభిమన్యుల పేర్లు సీఎం రేసులో చక్కర్లు కొడుతున్నాయి.

  • Loading...

More Telugu News