: ఇప్పటికైనా ఢిల్లీ ఎన్నికలకు బీజేపీకి దమ్ముందా?: కేజ్రీవాల్ సవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మంచి ఊపు మీదున్న బీజేపీకి సవాల్ విసిరారు. మహారాష్ట్ర, హర్యానాల్లో మునుపెన్నడూ లేని రీతిలో సత్తా చాటిన బీజేపి, ఇప్పటికైనా ఢిల్లీ ఎన్నికలకు ముందుకొచ్చే ధైర్యం చేస్తుందా? అంటూ ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న రాజీనామా చేసిన నాటి నుంచి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన సాగుతోంది. ఢిల్లీలో జరిగిన గత ఎన్నికల్లో ఆప్ చేతిలో మట్టికరిచిన బీజేపీ, అక్కడ ఎన్నికలకు వెళ్లేందుకు భయపడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర, హర్యానాలో అఖండ విజయం సాధించిన బీజేపీ, ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సవాల్ ను బీజేపీ స్వీకరిస్తే, వెనువెంటనే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ముగియనుంది.