: మిస్ యూనివర్స్ పోటీలకు బెంగళూరు యువతి నయోనిత లోధ్
2015 మిస్ యూనివర్స్ పోటీలకు బెంగళూరుకు చెందిన నయోనిత లోధ్ అర్హత సాధించింది. యమహా ఫాసినో మిస్ దివా యూనివర్స్ 2014 విజేతగా నిలిచిన 21 ఏళ్ల లోధ్, వచ్చే ఏడాది జనవరి 25న మియామీలో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొననున్నారు. యమహా ఫాసినో మిస్ దివా యూనివర్స్ 2014 ఫైనల్ పోటీలు ‘జీ కేఫ్’లో ఆదివారం ప్రసారమయ్యాయి. మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా, లోధ్ కు దివా యూనివర్స్ కిరీటాన్ని బహూకరించారు. ఈ పోటీలకు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.