: అంతిమ ఘడియల్లో బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ


బాక్సింగ్ దిగ్గజం మహ్మద్ అలీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. 30 ఏళ్లుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న మహ్మద్ అలీ, ప్రస్తుతం కదలలేని స్థితికి చేరుకున్నారు. దీంతో అలీ ఆరోగ్యం మెరుగయ్యే అవకాశాలు ఎంతమాత్రం లేవని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మహ్మద్ అలీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన హాలీవుడ్ చిత్రం ‘ఐ యామ్ అలీ’ ప్రీమియర్ షో గత వారం జరిగింది. ఈ కార్యక్రమానికి అలీ హాజరు కాలేకపోయారు. దీంతో అలీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం కూడా తాజాగా, అలీ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని తెలిపింది. అయితే, అలీ కూతురు మాత్రం తన తండ్రి అనారోగ్యాన్ని జయిస్తారని ధీమాగా చెబుతోంది.

  • Loading...

More Telugu News