: పని వాళ్లు కావాలా? అయితే, ఎందుకాలస్యం!


హుదూద్ తుపాను ధాటికి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు అతలాకుతలమయిపోయాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. షాపులు, పలు వస్తువులు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సదుపాయం లేకుండాపోయింది. దీంతో, వాటిని పునరుద్ధరించడానికి పని వారు కరవయ్యారు. దీంతో, ఆయా సహాయ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఓ పోర్టల్ ను సిద్ధం చేసింది. హుదూద్ తుపాను అనంతర పరిస్థితులను ఈ వెబ్ సైట్ లో పొందుపరిచారు. www.hudhud.ap.gov.in అనే వెబ్ సైట్ లో పూర్తి వివరాలు ఉంచారు. అలాగే నిపుణులైన ప్లంబర్లు, కార్పెంటర్ల లాంటి పనివాళ్ల కోసం ఈ వెబ్ సైట్ ద్వారా సంప్రదించవచ్చు. తుపాను కారణంగా నష్టపోయిన వారికి వృత్తి పని వారు కావాలంటే ఇందులో సమాచారం అందిస్తే నిపుణులు వచ్చి సమస్యను సరిదిద్దుతారు. వారికి లేబర్ ఛార్జీలను ప్రభుత్వం భరిస్తుంది. దీని కోసం సుమారు వెయ్యి మంది సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News