: విరాట్ కోహ్లీ... టెండూల్కర్ రికార్డు బీట్ చేశాడు!


భారత యువ సంచలనం, టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. వెస్టిండీస్ తో నాలుగో వన్డే సందర్భంగా సెంచరీ చేసిన కోహ్లీ, టెండూల్కర్ రికార్డుల ఛేదనలో తొలి అడుగేశాడు. ఆ మ్యాచ్ లో 127 పరుగులు చేసిన విరాట్, తన కెరీర్ లో 20 సెంచరీలను పూర్తి చేశాడు. కేవలం 64 ఇన్నింగ్స్ లోనే 20 సెంచరీలు చేసిన కోహ్లీ, అత్యంత వేగంగా ఈ ఫీట్ ను చేరిన క్రికెటర్ గా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. వన్డే కెరీర్ లో మొత్తం 49 సెంచరీలు చేసిన సచిన్, తొలి 20 సెంచరీలు చేసేందుకు 197 ఇన్నింగ్స్ లు ఆడాడు. తాజాగా 64 ఇన్నింగ్స్ లలోనే 20 సెంచరీలు పూర్తి చేయడం ద్వారా కోహ్లీ, సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలుకొట్టాడు.

  • Loading...

More Telugu News