: మోడీ మేనియా వర్కౌటైంది... మరాఠా గడ్డపై కమలం నవ్వింది


మహారాష్ట్రలో ఓట్ల లెక్కింపు ముగిసింది. శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతూ మరాఠా గడ్డపై కమలం వికసించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల గాను ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించకున్నా, 122 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ తర్వాత రెండో స్థానంలో నిలిచిన శివసేన 63 సీట్లు నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ 42 సీట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. ఇక, ఎన్సీపీ 41, ఇతరులు 19 స్థానాలు గెలవగా, రాజ్ థాకరే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. 2009 ఎన్నికల్లో బీజేపీ మహారాష్ట్రలో కేవలం 46 సీట్లే నెగ్గింది. అయితే, ఈసారి మోడీ ప్రత్యేక దృష్టిపెట్టడంతో సమీకరణాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. లోక్ సభ ఎన్నికల తరహాలోనే కాంగ్రెస్ కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక చతికిలబడింది. అటు, హర్యానాలో బీజేపీ అధికారానికి అవసరమైన మెజారిటీ సాధించడం తెలిసిందే. మొత్తం 90 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కమలనాథులు 47 స్థానాల్లో విజయఢంకా మోగించారు.

  • Loading...

More Telugu News