: ముందు జాగ్రత్తతో భారీ నష్టాన్ని ఆపగలిగాం: చంద్రబాబు


విశాఖపట్నంలో తుపాను సహాయక చర్యలను పర్యవేక్షించిన అనంతరం హైదరాబాదు చేరుకున్న చంద్రబాబు నాయుడు శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. సంఘటన చాలా భయంకరమైనదని పేర్కొన్నారు. తుపాను తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందని అన్నారు. ఇటీవల కాలంలో దేశంలో ఓ నగరంపై తుపాను విరుచుకుపడిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. మంచి నగరాన్ని తుపాను అతలాకుతలం చేయడం బాధాకరమని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలతో భారీ నష్టాన్ని నిలువరించగలిగామని చెప్పుకొచ్చారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి ప్రజల కష్టాలు తీర్చగలిగామని తెలిపారు.

  • Loading...

More Telugu News