: జయలలితకు రజనీకాంత్ లేఖ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు సూపర్ స్టార్ రజనీకాంత్ లేఖ రాశారు. జయలలితకు ఆయురారోగ్యాలు కలగాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అంతేగాకుండా, ఆమెకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు ఆమెకు నాలుగేళ్ళ జైలు శిక్ష విధించగా, సుప్రీంకోర్టు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసిన సంగతి విదితమే.