: ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో విషాదం
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు కాల్వలో పడి మృత్యువాత పడ్డారు. పిల్లలు మరణించారన్న వార్తతో తీవ్రంగా కలతచెందిన వారి అమ్మమ్మ గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. దీంతో, గ్రామంలో ఎక్కడ చూసినా విషాద ఛాయలు నెలకొన్నాయి. మరణించిన వారిని అంజమ్మ(12), సుజాత (8), రాముడు (9), ఆంజనేయులు (9)గా గుర్తించారు. చేపలు పట్టేందుకుని వెళ్ళి వారు ప్రాణాలు కోల్పోయారు.