: ఏపీ ప్రభుత్వం విఫలమైంది... ప్రాణనష్టం విషయంలో కూడా స్పష్టత లేదు: చిరంజీవి
హుదూద్ తుపాను సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమయిందని కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఆరోపించారు. తుపాను సహాయంపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. సహాయక చర్యలకు సంబంధించి తాము నిర్ణయాత్మక సూచనలు ఇస్తుంటే... వాటిని విమర్శలుగా భావిస్తున్నారని విమర్శించారు. భాధితులకు వీలైనంత మేలు జరగాలన్నదే తమ తాపత్రయమని చెప్పారు. తుపాను వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయంలో కూడా ప్రభుత్వానికి స్పష్టత తేదని అన్నారు.