: చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న జయలలిత
ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. వందలమంది పార్టీ కార్యకర్తలు ఎయిర్ పోర్టు వద్ద జయకు ఘన స్వాగతం పలికారు. అటు చెన్నైలోని జయ నివాసం వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిమంది చేరుకుని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇరవై రోజుల పాటు జైల్లో ఉండి విడుదలయిన జయకు విమానాశ్రయం నుంచి ఆమె నివాసం వరకు కార్యకర్తలు మానవహారంగా ఏర్పడ్డారు.