: తెలంగాణలో జూడాల సమ్మె ఉద్ధృతం


తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మ ఉద్ధృతమవుతోంది. రెండు రోజులుగా అత్యవసర సేవలను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు తాజాగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో సేవలందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్ వైద్యులు సమ్మెబాటపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత 19 రోజులుగా తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కాళాశాలల్లో సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గాంధీ ఆసుపత్రికి వెళ్లి జూడాలకు మద్దతు తెలిపారు.

  • Loading...

More Telugu News