: జయ బెయిల్ ష్యూరిటీ విలువ రూ.1 కోటి!


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అన్ని విషయాలూ రికార్డులే. ముఖ్యమంత్రి పదవిలో ఉండగా దోషిగా తేలిన తొలి ముఖ్యమంత్రిగా జయ రికార్డులకెక్కారు. ఇక ఈ కేసు విచారణ దాదాపు 18 ఏళ్ల పాటు కొనసాగి మరో చరిత్ర సృష్టించింది. జయకు కోర్టు విధించిన జరిమానా విషయమైతే చెప్పనవసరమే లేదు. రూ.66 కోట్ల అక్రమాస్తుల కేసులో జయలలితకు పరప్పన అగ్రహార కోర్టు ఏకంగా రూ.100 కోట్ల జరిమానాను విధించింది. ఇంత పెద్ద మొత్తంలో జరిమానాకు గురైన వ్యక్తులు రాజకీయ రంగంలో దాదాపుగా లేరనే చెప్పాలి. ఇదిలా ఉంటే, బెయిల్ కోసం జయలలిత, ఏకంగా రూ.1 కోటి పూచీకత్తును కోర్టుకు సమర్పించనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కోర్టుకు ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తులు కూడా అతి తక్కువ మందే ఉన్నారు.

  • Loading...

More Telugu News