: విశాఖ ప్రజలు దీపాలతో దీపావళి జరుపుకోవాలి: చంద్రబాబు


విశాఖ ప్రజల కళ్లల్లో ఆనందం చూడాలనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ క్రమంలో నగర ప్రజలంతా ఆనందంగా దీపావళి జరుపుకోవాలని చెప్పారు. అందరూ దీపాలు పెట్టి పండుగను జరుపుకోవాలన్న సీఎం... బాణాసంచా మాత్రం కాల్చవద్దని ఆయన సూచించారు. అవసరమైతే దీపాలు సరఫరా చేస్తామన్నారు. తుపాను పరిస్థితుల నేపథ్యంలో విశాఖ ప్రజల సేవాదృక్పథాన్ని అభినందిస్తున్నానన్నారు. ఈ మేరకు విశాఖ కలెక్టరేట్ లో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ, విశాఖ పునర్ నిర్మాణానికి ప్రతి పౌరుడు పాలుపంచుకోవాలన్నారు. నగరానికి పూర్వ వైభవం తేవాలన్న బాబు, గతకంటే ఇంకా సుందరంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఈ అభివృద్ధిలో ఆలోచనలు పంచుకునేందుకు సామాజిక మీడియాను ఉపయోగించుకుందామన్నారు. విశాఖ అభివృద్ధి చూసి ఎందుకొచ్చానా? అని 'హుద్ హుద్' తుపాన్ అనుకోవాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News