: ఓటమికి అడుగు దూరంలో విండీస్


ధర్మశాలలో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ గెలుపుకు అడుగు దూరంలో నిలిచింది. విండీస్ ముందు భారీ లక్ష్యం ఉంచిన టీమిండియా, చక్కని బౌలింగ్ తో విండీస్ ను ఓటమి అంచున నిలబెట్టింది. 331 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 45 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. శామ్యూల్స్ సెంచరీ చేయడంతో విండీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రసెల్స్(46) మెరుపులు మెరిపించడంతో టీమిండియా ఓడిపోతుందనే భ్రమ కలిగింది. అతనిని ఉమేష్ యాదవ్ అవుట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ పతనం సాగిపోయింది. స్యామీ (16), బ్రేవో (40), పొలార్డ్ (6), రామ్ దిన్ (9) పరుగులు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(127) సెంచరీ తో సత్తా చాటగా, రైనా (71), రహానే (68) అతనికి చక్కని సహకారమందించారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత జట్టు విజయాన్ని విండీస్ అడ్డుకోలేదు.

  • Loading...

More Telugu News