: బీజేపీ, సంఘ్ పరివార్ డబుల్ గేమ్ ఆడుతున్నాయి: రీటా బహుగుణ
బీజేపీ, సంఘ్ పరివార్ డబుల్ గేమ్ ఆడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత రీటా బహుగుణ జోషి మండిపడ్డారు. లక్నోలో ఆమె మాట్లాడుతూ, హిందూ రాష్ట్ర్, లవ్ జిహాద్ పేరిట ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక కమలనాథులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆమె విమర్శించారు. హిందూ రాష్ట్ర్, లవ్ జిహాద్ అంటూ బీజేపీ, సంఘ్ పరివార్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.