: తెలంగాణ ప్రభుత్వం 1587 కోట్లు బకాయి పడింది
బోధనా రుసుములు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో కళాశాలలకు ఎంత మొత్తంలో ప్రభుత్వం బాకీ పడిందనే విషయాన్ని తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఆరాతీశారు. కళాశాలలకు మొత్తం 1,587 కోట్ల రూపాయలు బాకీ పడినట్టు ప్రభుత్వం గుర్తించింది. 2010-11 విద్యాసంవత్సరంలో 34 కోట్ల రూపాయలు బాకీ పడగా, 2011-12 విద్యా సంవత్సరానికి 19 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది, 2012-13 లో 88 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది, 2013-2014లో 1,444 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని గుర్తించింది. దీంతో బాకీలన్నీ విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించింది. తొలి విడతగా 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు.