: కోహ్లీ సెంచరీ టీమిండియా భారీ స్కోరు... 330/6
ధర్మశాలలో టీమిండియా, విండీస్ మధ్య జరుగుతున్న నాలుగవ వన్డేలో కోహ్లీ, రైనా, రహానే రాణించడంతో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. విమర్శకులకు కోహ్లీ సమాధానం చెబుతూ 114 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 127 పరుగులు చేయడంతో టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేసింది. అతనికి రైనా (71), రహానే (68) అద్భుత సహకారమందించారు. ధావన్ (35) రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో టేలర్, హోల్డర్, రసెల్, బెన్ తలో వికెట్ తీశారు. వెస్టిండీస్ విజయ లక్ష్యం 331