: చంద్రబాబుపై వైఎస్సార్సీపీ కీలక నేత ప్రశంసలు
చంద్రబాబునాయుడిని వైఎస్సార్సీపీ నేతలు పొగడటమేంటని అనుకుంటున్నారా? ఒకరిపై విమర్శలు చేయాలంటే మరొకరిని పొగడక తప్పదు కదా. ఆ తరహాలోనే ఈ ఘటన జరిగిందిలెండి. చంద్రబాబునాయుడిని వైఎస్సార్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియా సాక్షిగా పొగిడారు. తెలంగాణలో నానాటికీ పెరిగిపోతున్న విద్యుత్ కోతలపై మాట్లాడిన సందర్భంగా పొంగులేటీ కేసీఆర్ పై విమర్శలు సంధించే సమయంలో చంద్రబాబును పొడిగారు. ముందుచూపున్న నేతల్లో చంద్రబాబు ఒకరని, చంద్రబాబు ముందు చూపును మెచ్చుకోవాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు చంద్రబాబులాగా ముందు చూపులేదని, ఈ కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఆందోళనకరస్థాయికి చేరాయని ఆయన చెప్పారు.