: తెలంగాణ సీఎంతో తుమ్మల నాగేశ్వరరావు భేటీ


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన తుమ్మల, కేసీఆర్ తో సమావేశమయ్యారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కేసీఆర్ ఆహ్వానం మేరకే తుమ్మల ఆయనతో భేటీ అయ్యారన్న ప్రచారమూ జరుగుతోంది. గురువారం గవర్నర్ ను కలసిన అనంతరం పలువురు పార్టీ నేతలతో మాట్లాడిన కేసీఆర్, సీనియర్లు అందుబాటులో ఉండాలని కోరినట్లు వార్తలొచ్చాయి. దీంతోనే కేసీఆర్ ను తుమ్మల కలిశారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News