: నేడు తెలంగాణ రుణ మాఫీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ


తెలంగాణలో రుణమాఫీకి సంబంధించిన చర్యల కోసం ఏర్పడ్డ మంత్రివర్గ ఉప సంఘం నేడు సమావేశం కానుంది. వ్యవసాయ రుణాల మాఫీపైనే ఈ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అనంతరం జరుగుతున్న మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే, రుణ మాఫీకి సంబంధించి సర్కారు బ్యాంకులకు విడుదల చేసిన తొలి విడత నిధుల విషయంలో జాప్యం జరిగిన నేపథ్యంలో రైతులపై పడే భారాన్ని ఎలా నివారించాలనే అంశంపై ఈ సమావేశంలో మంత్రివర్గ ఉప సంఘం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News