: ఫీజు రీయింబర్స్ మెంట్ కు టీఎస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభవార్త. బోధనా ఫీజు బకాయిలను చెల్లించాలని టీఎస్ సర్కార్ నిర్ణయించింది. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి పచ్చ జెండా ఊపారు. ఫీజు బకాయిలను మూడు విడతల్లో చెల్లించాలని నిర్ణయించామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.