: తెలుగు గ్రామానికి రూ. 3.50 కోట్లు కేటాయించిన సచిన్


నెల్లూరు జిల్లా గూడూరు మండలం పుట్టంరాజు కండ్రిగ గ్రామాభివృద్ధికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నడుం బిగించాడు. రాజ్యసభ ఎంపీ అయిన సచిన్... తన నిధుల నుంచి రూ. 3.50 కోట్లను ఈ గ్రామానికి కేటాయించాడు. ఈ వివరాలను ప్రధాని నరేంద్రమోడీకి సచిన్ వివరించాడు. పుట్టంరాజు కండ్రిగలో జరుగుతున్న పనుల వివరాలను మోడీకి తెలిపాడు. నిన్న తన భార్య అంజలితో కలసి మోడీని కలిశాడు సచిన్. ఈ సందర్భంగా 'సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన'లో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్టు ప్రధానికి తెలిపాడు. అంతేకాకుండా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడానికి మరికొంత మందిని ఆహ్వానిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా, సచిన్ సేవా భావాన్ని ప్రధాని మోడీ కొనియాడారు.

  • Loading...

More Telugu News