: తుపాను సాయం ప్రకటించిన హరీష్ శంకర్, కొరటాల శివ, స్మిత
హుదూద్ తుపాను బాధితులకు సినీ పరిశ్రమ నుంచి మరికొందరు విరాళాలు ప్రకటించారు. దర్శకులు హరీష్ శంకర్ రూ.3 లక్షలు, కొరటాల శివ రూ.3.5 లక్షలు, పాప్ సింగర్ స్మిత రూ.5 లక్షలు సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. కమెడియన్ అలీ, నాగ శౌర్య, నటుడు రావు రమేష్ తలో రూ.లక్ష, సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్ రూ.50వేలు ప్రకటించారు.