: తెలంగాణ హైకోర్టు ఏర్పాటుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ అంగీకారం


తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్.దత్తు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈరోజు ఢిల్లీలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గురించి చర్చించారు. అటు, కింగ్ కోఠీలోని పరదా ప్యాలెస్ లేదా ఎర్రమంజిల్ ఆర్ అండ్ బీ భవనంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఆ భవనాలను కూడా పరిశీలించారు. ప్రస్తుత హైకోర్టు భవనాన్ని తాత్కాలికంగా ఏపీకి కేటాయించాలని అనుకుంటున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News