: రాహుల్ గాంధీకి 'లో ఐక్యూ' ఉందన్న కాంగ్రెస్ నేత బహిష్కరణ


మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత గుఫ్రాన్ ఏ అజమ్ ను అధిష్ఠానం పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ మేరకు అతను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ మాజీ ఎంపీ ఒకరు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి గత వారం లేఖ రాశారు. విషయాన్ని పరిశీలించిన హైకమాండ్ పైవిధంగా చర్యలు తీసుకుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మానెక్ అగర్వాల్ మాట్లాడుతూ, అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని అధిష్ఠానమే నిర్ణయించిందని తెలిపారు. అంతకుముందు పార్టీ అధికారాన్ని ప్రశ్నించిన అతనిపై రాష్ట్ర పీసీసీ ఏ విధంగానూ చర్యలు తీసుకోలేదని, అందుకే ఏఐసీసీ అతనిని పార్టీ నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అజమ్ జులైలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయని, ఆయనకు పెద్దగా తెలివితేటలు (లో- ఐక్యూ) లేవని లేఖలో విమర్శించారు. లేఖ పర్యవసానమే తాజాగా బహిష్కరణ వేటు పడింది.

  • Loading...

More Telugu News