: భారత్ ను ఎవరూ హెచ్చరించలేరంటున్న కేంద్ర హోం మంత్రి
అరుణాచల్ ప్రదేశ్ లో చైనా సరిహద్దు సమీపంలో భారత్ రహదారి నిర్మించడంపై చైనా అభ్యంతరం చెప్పడం తెలిసిందే. దీనిపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ దీటుగా స్పందించారు. గుర్గావ్ లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్ జీ) రైజింగ్ డే సందర్భంగా మాట్లాడుతూ, భారత్ కు ఎవరూ హెచ్చరికలు జారీ చేయలేరని స్పష్టం చేశారు. భారత్ చాలా శక్తిమంతమైన దేశమని పేర్కొన్నారు. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రాజ్ నాథ్ సూచించారు.